ఆరోజు బాగా ఏడ్చేశాను అంటోన్న నటి
హైదరాబాద్: పెళ్లి సంబంధం కుదిరి.. డేట్ కూడా ఓకే అనుకున్నాక.. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని నటి షకీలా తెలిపారు. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి తాజాగా షకీలా, అనురాధ విచ్చేసి తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆటోబయోగ్రఫీ అంటే అందులో అన్నీ నిజాలే చెప్పాలని.. అందుకే లైఫ్‌లో ఎదుర్కొన్న అన్నిరకాల కష్టసుఖాలను తన స్వీయ జీవితచరిత్రలో వెల్లడించానని షకీలా తెలిపారు. తన వివాహం గురించి మాట్లాడుతూ.. ‘ఒక సారి నాకు పెళ్లి కుదిరింది. వివాహ తేదీని కూడా ఫిక్స్ చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత అన్ని ఆ వ్యక్తే అనుకున్నాను. అయితే రోకా సమయంలో ఆ వ్యక్తి (పెళ్లికొడుకు) మద్యం తాగి వచ్చి గొడవ చేశాడు. ఆ సమయంలో మా ఇద్దరికీ వాగ్వాదం చోటుచేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పేశాను. అలా నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. కాకపోతే ఆ కుటుంబంలోని వారందరూ ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటారు’ అని షకీలా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
అనంతరం లాక్డౌన్ సమయంలో టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ తనకి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని.. ఆయన మాటలు వినగానే కన్నీళ్లు ఆగలేదని.. షకీలా భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా షకీలా, అనురాధ పంచుకున్న ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి ఉండాల్సిందే. జనవరి 25న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోమో చూసేయండి..!
ఇదీ చదవండి
పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది!
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
- మార్చి 15 నుంచి ‘అన్నాత్తే’ షూట్!
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ