19ఏళ్ల తర్వాత స్టార్‌హీరో భార్య రీఎంట్రీ? - shalini ajith to make a comeback in tamil cinema with ponniyin selvan
close
Published : 13/02/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

19ఏళ్ల తర్వాత స్టార్‌హీరో భార్య రీఎంట్రీ?

స్టార్‌ డైరెక్టర్‌ మూవీలో కీ రోల్‌

చెన్నై: దాదాపు రెండు దశబ్దాల తర్వాత ఓ స్టార్‌హీరో సతీమణి వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బాలనటిగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘సఖి’తో కథానాయికగా సినీప్రియుల్ని అలరించిన నటి షాలినీ. కథానాయికగా రాణిస్తున్న తరుణంలో హీరో అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్‌’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు.

కాగా, షాలినీ మరోసారి వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కథానాయికగా ఆమెకు బ్రేక్‌ ఇచ్చిన మణిరత్నం చిత్రంతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు త్రిష, కార్తి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌‌’లో షాలినీ ఓ కీలకపాత్ర పోషించనున్నారని గత కొన్నిరోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో షాలినీ త్వరలోనే భాగం కానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని