ఆ సినిమా బీజీఎం.. ‘శంకర్‌ దాదా’ సాంగ్‌! - shankar dada song from another film bgm
close
Published : 25/03/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమా బీజీఎం.. ‘శంకర్‌ దాదా’ సాంగ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని పాటలు వింటున్నప్పుడు అరే! ఇది ఫలానా సినిమాలోని నేపథ్యం సంగీతం కదా అనిపిస్తుంటుంది. మరి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ చిత్రంలోని టైటిల్‌ గీతం ‘బేగంపేట బుల్లెమ్మో’ విన్నప్పుడు అలా ఏమైనా అనుకున్నారా? ‘బేగంపేట బుల్లెమ్మో’ సాహిత్యం ఎంతగా హుషారెత్తిస్తుందో అందులోని క్యాచీ ట్యూన్‌ అంతకన్నా ఎక్కువగా ఉర్రూతలూగిస్తుంది. ఆ బీట్‌కి చిరంజీవి స్టెప్పులు తోడవ్వడంతో సూపర్‌ హిట్‌గా నిలిచిందా గీతం. ఈ మ్యూజిక్‌ మరో చిత్రంలోని నేపథ్య సంగీతం (బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌) అంటే నమ్ముతారా? జె.డి. చక్రవర్తి కథానాయకుడిగా తెరకెక్కిన ‘నవ్వుతూ బతకాలిరా’ చిత్రంలో ఈ బీట్‌ వినిపిస్తుంది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో ఎంట్రీ సమయంలో వినిపిస్తుంది ఈ మ్యూజిక్‌. ‘అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, యానాం, కడియం, రాజ రాజ రాజమండ్రి’ అంటూ చక్రవర్తి చెప్పే సంభాషణకు సంబంధించిన బీజీఎం ఇది. కథానాయకుడి పాత్రకు తగినట్టుగా బీజీఎం అందించినప్పటికీ అదే ట్యూన్‌తో ఆ చిత్రంలో పాట చేసే అవకాశం రాలేదు. బీట్‌ బాగుండటంతో  కొన్నాళ్ల తర్వాత జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘శంకర్‌ దాదా’ సినిమాకి తీసుకున్నారు. ఈ రెండింటి వెనక ఉన్న స్వర కర్త ఒకరే. ఆయనెవరో కాదు.. సంగీత సంచలనంగా పిలిచే దేవిశ్రీ ప్రసాద్‌. డీఎస్పీ ఒక్కరికే కాదు చాలామంది మ్యూజిక్‌ డైరక్టర్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ కథ కోసం మనసు పెట్టి రూపొందించిన స్వరాన్ని మరో చిత్రంలో పాటగా ఆవిష్కరించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని