శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యం - shardul thakur and washington sundar record breaking century partnership at gabba stadium
close
Updated : 17/01/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శార్దూల్‌, సుందర్‌ రికార్డు భాగస్వామ్యం

బ్రిస్బేన్‌: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శార్దూల్‌ ఠాకుర్‌ (67), వాషింగ్టన్‌ సుందర్‌ (62) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా పెద్దస్కోర్లు సాధించక పోయినా వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. గబ్బాలో టీమ్‌ ఇండియాకు ఇదే అత్యధిక ఏడో వికెట్‌ భాగస్వామ్యం కావడం విశేషం. అలాగే ఆసీస్‌ గడ్డపై మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అయితే, జట్టు స్కోరు 309 వద్ద శార్దూల్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే సుందర్‌ సైతం స్టార్క్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ చేతికి చిక్కాడు. దీంతో చివరికి టీమ్‌ ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది.

ఆసీస్‌లో ఏడో వికెట్ భాగస్వామ్యాలు

* 2018-19 సీజన్‌లో రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టులో ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.

* 1947-48 సీజన్‌లో విజయ్‌ హజారే, హెచ్‌ అధికారి అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 132 పరుగులు సాధించారు.

* 1991-92 సీజన్‌లో అజారుద్దీన్‌‌, మనోజ్‌ ప్రభాకర్‌ అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 101 పరుగులు జోడించారు.

ఇవీ చదవండి..
ఒక్క వికెట్‌ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్‌
యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని