శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ వైరల్‌ - shardul thakurs middle finger bowling action goes viral in social media
close
Published : 30/03/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా నయా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఇటీవల మంచి ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన అతడు తాజాగా ఇంగ్లాండ్‌తోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆదివారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 30 పరుగులు చేసి జట్టుకు విలువైన స్కోర్‌ అందించాడు. ఈ క్రమంలోనే అతడు వేసిన ఓ బంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 329 పరుగులకు ఆలౌటవ్వగా.. ఛేదనలో ఇంగ్లాండ్‌ 322/9 స్కోరుకు పరిమితమైంది. దాంతో ఏడు పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ క్రమంలోనే శార్దూల్‌ వేసిన ఓ బంతి నెటిజన్లను ఆకట్టుకుంది. అతడు బౌలింగ్‌ చేసేటప్పుడు మధ్య వేలితో బంతిపై పట్టుసాధించి విసరడం కనిపించింది. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దానికి అభిమానులు వివిధ మీమ్స్‌తో సరదా కామెంట్లు పెట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 67 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. డేవిడ్‌ మలన్‌(50), జోస్‌ బట్లర్‌(15), లియామ్‌ లివింగ్‌స్టన్‌(29), అదిల్‌ రషీద్‌(19)ను శార్దూల్‌ పెవిలియన్‌ పంపాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని