Cinema news: సెప్టెంబరులో షారుఖ్‌-అట్లీ చిత్రం షురూ! - sharukh atlee movie
close
Published : 30/08/2021 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: సెప్టెంబరులో షారుఖ్‌-అట్లీ చిత్రం షురూ!

10రోజుల పాటు పుణెలో చిత్రీకరణ

పుణె: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌- తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తమిళంలో ‘రాజా రాణి’, ‘తెరీ’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలతో నిరూపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలిచిత్రం. ప్రస్తుతం షారుఖ్‌-దీపిక పదుకొణె కలయికలో వస్తున్న ‘పఠాన్‌’ షూటింగ్‌ లొకేషన్ల ఎంపిక కారణంగా వాయిదా పడింది. ఈలోపు ఆ సమయాన్ని అట్లీ చిత్రంలో నటించేందుకు ఇచ్చారట షారుఖ్‌. 10రోజుల పాటు పుణెలో చిత్రీకరణ జరగనుంది. కాగా ఈచిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అట్లీ తొలి చిత్రం ‘రాజారాణి’లో నటించిన నయనతార ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుందట. ఈ విషయం పై నయన్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాన్య మల్హోత్ర, సునీల్‌ గ్రోవర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని