ఒక్క చంద్రముఖి.. ఇద్దరు రజనీకాంత్‌లు.. ‘ఢీ’లో అదిరిపోయే ఈ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ చూశారా..? - sharvari performance dhee 13 kings vs queens
close
Published : 05/08/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క చంద్రముఖి.. ఇద్దరు రజనీకాంత్‌లు.. ‘ఢీ’లో అదిరిపోయే ఈ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ చూశారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చంద్రముఖి’ సినిమాలో చంద్రముఖి(జ్యోతిక) ‘రారా..’ అంటూ చేసిన డ్యాన్స్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి అదే చంద్రముఖి అదే పాటకు ఇద్దరు రజనీకాంత్‌లతో డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ13’లో చేసి కళ్లకు కట్టినట్లు చూపించారు. ఓవైపు వేంకటపతిరాజు, మరోవైపు బాబా ఇలా ఇద్దరు రజనీకాంత్‌లతో చంద్రముఖిగా ‘ఢీ’ కంటెస్టెంట్‌ శార్వరీ డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. ఓ అమ్మాయిని ఆవహించిన చంద్రముఖి.. ‘రజనీకాంత్‌తో కలిసి ఒక్కసారి డ్యాన్స్‌ చేయాలని ఉంది. ఆ కోరిక నెరవేరిస్తే వెళ్లిపోతా’ అని చెప్పడంతో పంతులు ఏదో మంత్రం చదివి రజనీకాంత్‌ను రప్పిస్తాడు. ఇంకేముంది వేంకటపతిగా రజనీకాంత్‌ ఎంట్రీ ఇస్తాడు. అలా మొదలైన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్సు అందరితో ఈలలు వేసి అరుపులు పెట్టించింది. మధ్యలో కాసేపు క్లాసికల్‌ను పక్కనబెట్టి ఇద్దరూ కలిసి బ్రేక్‌ డ్యాన్స్‌ కూడా వేశారు. ఆఖర్లో ‘బాబా’గా చంటి ఎంట్రీ ఇవ్వడంతో వినోదం మరో స్థాయికి వెళ్లిపోయింది. ఇలా ఇద్దరు రజనీకాంత్‌లతో చంద్రముఖి డ్యాన్స్‌ చేసి మురిసిపోయింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని