Sreekaram: ఓటీటీలో విశేష ఆదరణ - sharwanand sreekaram gets record views on sun nxt
close
Published : 30/04/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sreekaram: ఓటీటీలో విశేష ఆదరణ

హైదరాబాద్‌: యువ కథానాయకుడు శర్వానంద్‌ కీలక పాత్రలో బి.కిషోర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

త‌రాలుగా సాగుతున్న వ్యవసాయ పరిస్థితిని మార్చి, కొత్త పుంత‌లు తొక్కించడానికి ఓ యువకుడు ఏం చేశాడు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేయడం వెనుక కారణం ఏంటి?వ్యవసాయం చేసే క్రమంలో ఆ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్న ఇతివృత్తంతో సినిమాను తెరకెక్కించారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. విమర్శకులనూ మెప్పించింది. తాజాగా సన్‌నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా అందరికీ అందుబాటులోకి వచ్చింది ‘శ్రీకారం’. ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజులకే సన్‌నెక్ట్స్‌ యాప్‌లో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న సినిమాగా నిలిచింది.

14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చారు. సాయికుమార్‌, మురళీశర్మ, రావు రమేశ్‌, నరేశ్‌, ఆమని తదితరులు కీలక పాత్ర పోషించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని