ఆ ఓటీటీలో శర్వానంద్‌ ‘శ్రీకారం’ - sharwanand srikaram movie in ott
close
Published : 16/04/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఓటీటీలో శర్వానంద్‌ ‘శ్రీకారం’

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. బి.కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  ప్రియాంక అరుళ్ మోహన్‌ నాయిక.  సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రావు రమేశ్‌, ఆమని, నరేశ్‌, మురళీ శర్మ  కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. తాజాగా సినిమా సన్‌ నెక్స్ట్‌  ద్వారా ఏప్రిల్‌ 16 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.  మిక్కీ జె. మేయర్ సంగీత స్వరాలు అందించగా  మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేశారు. జె. యువరాజు కెమెరామెన్‌. ‘శ్రీకారం’ చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ..‘‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’చక్కని చిత్రమని’’ పేర్కొన్నారు.  




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని