ప్చ్‌..! గబ్బర్‌ సెంచరీ మిస్‌ - shikar dhwana out for 98
close
Published : 23/03/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌..! గబ్బర్‌ సెంచరీ మిస్‌

98 వద్ద బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔట్‌

పుణె: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11×4, 2×6)ను దురదృష్టం వెంటాడింది. 2 పరుగుల తేడాతో శతకం చేజారింది. అతడు ఆరోసారి 90ల వద్ద ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 38.1వ బంతికి ఇయాన్‌ మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్టోక్స్ వేగం తగ్గించి షార్ట్‌పిచ్‌లో వేసిన బంతిని ధావన్‌ మిడ్‌వికెట్లో పుల్‌ చేశాడు. అక్కడే ఉన్న మోర్గాన్‌ ఏ మాత్రం తప్పు చేయలేదు. బంతిని చక్కగా ఒడిసిపట్టాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ధావన్‌ మంచి టచ్‌లో కనిపించాడు. ఫామ్‌లోకి తిరిగొచ్చాడు. మొదట్లో ఆచితూచి ఆడిన అతడు చక్కని బౌండరీలతో అలరించాడు. 68 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. రోహిత్‌తో తొలి వికెట్‌కు 64, కోహ్లీతో రెండో వికెట్‌కు 105 పరుగులు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అర్ధశతకం తర్వాత వేగం పెంచిన ధావన్‌ శతకానికి చేరువయ్యాడు. కానీ దురదృష్టం వెంటాడటంతో 18వ శతకం చేజార్చుకున్నాడు. నిరాశగా మైదానం వీడాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని