Dhawan: అతడి కళానైపుణ్యం చూశారా? - shikhar dhawan amazed his fans with flute
close
Published : 21/05/2021 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhawan: అతడి కళానైపుణ్యం చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ శుక్రవారం తన అభిమానులను అలరించాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన అతడు కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో రూపొందించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బ్యాటింగ్‌లో దుమ్మురేపే గబ్బర్‌ తనలోని మరో నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. వర్షం కురిసే వేళ అందమైన బాల్కనీలో కూర్చొని ఓ పాటకు ఫ్లూట్‌ వాయించాడు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే నెటిజెన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.

కాగా, ఇటీవల కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో గబ్బర్‌ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దిల్లీ తరఫున మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో 380 పరుగులు చేసి అందరికన్నా ముందున్నాడు. మరోవైపు వచ్చే నెలలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు సైతం ధావన్‌ ఎంపికవ్వలేదు. దాంతో ప్రస్తుతం కుటుంబంతోనే ఉన్నాడు. అయితే, జులైలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఆడనున్నాడు. ఆ బృందానికి ధావన్‌ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని