Cricket News: గబ్బర్‌ వేణుగానం.. షా గాత్ర దానం - shikhar dhawan prithvi shaw groove on kishore kumar classic
close
Updated : 16/07/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: గబ్బర్‌ వేణుగానం.. షా గాత్ర దానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మరోసారి తన వేణుగానంతో అలరించాడు. అతడికి తోడుగా పృథ్వీ షా తన గాత్రంలో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి కిషోర్‌ కుమార్‌ అలపించిన ‘షామ్‌ మస్తాని’ గీతాన్ని ఆస్వాదించారు. గబ్బర్‌ పిల్లనగ్రోవితో రాగాలు పలికించగా షా పాట పాడటం గమనార్హం. ‘మా సూపర్‌ సింగర్‌ పృథ్వీ షాతో కలిసి గురువారం బాణీలు’ అని శిఖర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ దిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనింగ్‌ చేస్తారు. వీరిద్దరూ అవగాహనతో పరుగులు చేస్తారు. ఇప్పుడు అదే సాన్నిహిత్యం టీమ్‌ఇండియాకు మేలు చేయనుంది. శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీసుల్లో శుభారంభాలు అందించేందుకు పనిచేయనుంది. లంకలో వీరిద్దరూ విచిత్రమైన కార్యక్రమాలు, ఆటల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ నెల 18 నుంచి శ్రీలంక సిరీసు ఆరంభం కానుంది. రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడతాయి. రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణలోని యువ భారత్‌ ఉరకలేస్తోంది. తమకు అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాలని కుర్రాళ్లు భావిస్తున్నారు. ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు ధావన్‌, షా, సంజు, సూర్యకుమార్‌ టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా ఆడనున్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని