‘కప్పెలా’ రీమేక్‌లో మలయాళీ చిన్నది.. తప్పుకొన్న శివాత్మిక! - shivatmika lost a golden chance bagged by anikha surendran
close
Published : 10/08/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కప్పెలా’ రీమేక్‌లో మలయాళీ చిన్నది.. తప్పుకొన్న శివాత్మిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే ఎంతోమంది పొరుగు రాష్ట్రాల నటులు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు మరో మలయాలీ చిన్నది కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అజిత్‌-నయనతార జంటగా వచ్చిన ‘విశ్వాసం’, అజిత్‌-అనుష్కశెట్టి నటించిన ‘ఎంతవాడుగానీ’ సినిమాల్లో అజిత్‌ కూతురిగా నటించిన చిన్నది గుర్తుందా..! ఆమె పేరు అనిఖా సురేంద్రన్‌. ఇప్పటికే మలయాళంతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా ప్రవీణ్‌సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో పాటు ఓ తెలుగు రీమేక్‌లోనూ ఈ చిన్నది ఓ కీలకపాత్రలో ఛాన్స్‌ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళంలో ప్రశంసలు అందుకున్న ‘కప్పెలా’ను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రీమేక్‌ చేస్తోంది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ, అర్జున్‌దాస్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. చంద్రశేఖర్‌ టి.రమేశ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కోసం ముందు రాజశేఖర్‌ కూతురు శివాత్మికను అనుకున్నారట. గత నెలలో ప్రారంభమైన ఈ సినిమాలో శివాత్మికకు బదులుగా అనిఖాను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి శివాత్మిక ఎందుకు తప్పుకొంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని