మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా: శ్రేయా ఘోషల్ - shreya ghoshal shares pics
close
Published : 29/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా: శ్రేయా ఘోషల్

ముంబయి: ‘ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌. బేబీ బంప్‌కి సంబంధించిన కొన్ని ఫొటోల్ని పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారామె. ‘నా జీవితంలో అద్భుతమైన దశని అనుభవిస్తున్నా. దేవుడి మహిమ’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన అభిమానులు, సినీ తారలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇటీవలే తాను తల్లికాబోతున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా  తెలియజేశారు శ్రేయ. ‘బేబీ శ్రేయాదిత్య (శ్రేయాఘోషల్‌+షీలాదిత్య) రాబోతోంది. షీలాదిత్య, నేనూ ఈ శుభవార్తను మీతో పంచుకోవడం సంతోషకరంగా భావిస్తున్నాం. జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో మీ దీవెనలు మాకెంతో అవసరం’ అని అన్నారు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లో సైతం శ్రేయ తన గాత్రంతో మాయ చేశారు. ఇటీవలే తెలుగు చిత్రాలు ‘ఉప్పెన’, ‘టక్‌ జగదీశ్‌’ చిత్రాల్లోని పాటల్ని ఆమె ఆలపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని