రెండు వన్డేలకు శ్రేయస్‌ దూరం! - shreyas iyer likely to be ruled out of remaining 2 odis vs england due to shoulder injury
close
Updated : 24/03/2021 21:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు వన్డేలకు శ్రేయస్‌ దూరం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌ దూరమయ్యే అవకాశం ఉంది. మంగళవారం పుణెలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఎనిమిదో ఓవర్‌లో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్‌ ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో విలవిలాడుతున్న శ్రేయస్‌ను భారత ఫిజియోథెరపీ బృందం వెంటనే మైదానం నుంచి తీసుకెళ్లింది. అనంతరం శ్రేయస్‌కు స్కానింగ్‌ చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు  తేలింది. గాయం తీవ్రత తగ్గి మళ్లీ అయ్యర్‌ మైదానంలో అడుగుపెట్టడానికి ఆరు వారాల వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ప్రారంభ మ్యాచులకు సైతం దిల్లీ కెప్టెన్‌ అయిన శ్రేయస్‌ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. మరో వైపు, ఇదే మ్యాచ్‌లో గాయపడిన రోహిత్‌ శర్మ ఈ నెల 26, 28 తేదీల్లో పుణెలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డేలకు ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని