మా పద్ధతి మార్చుకోం: శ్రేయస్‌ - shreyas iyer says india will not change their approach after first loss in t20 against england
close
Updated : 13/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా పద్ధతి మార్చుకోం: శ్రేయస్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైనా తమ బ్యాటింగ్‌ పద్ధతిలో మార్పులు చేసుకోమని టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తేల్చిచెప్పాడు. ఇంగ్లిష్‌ జట్టుతో జరిగిన తొలి టీ20‌లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. శ్రేయస్‌ అయ్యర్‌(67; 48 బంతుల్లో 8x4, 1x6) ఆదుకోవడంతో భారత్‌ 20 ఓవర్లలో 124/7 స్కోర్‌ సాధించింది. లేదంటే మరో భారీ ఓటమి చవిచూసేది. అనంతరం ఇంగ్లాండ్‌ 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో శ్రేయస్ మాట్లాడాడు.

‘టీమ్‌ఇండియాలో ఆడేటప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. నా బ్యాటింగ్‌ శైలిలోనూ ఏ మార్పులు చేసుకోలేదు. ఏ స్థానంలో ఆడుతున్నామనే విషయం కేవలం ఆలోచనా విధానం మాత్రమే. జట్టుకు ఏది అవసరమో అదే చేయాలని ఆలోచించాలి. నేనైతే అలాగే ఆడతాను. పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌ చేస్తా. ఈరోజు పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నవి. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక మా బ్యాటింగ్‌ తీరులో ఎలాంటి మార్పులూ చేసుకోము. ఎందుకంటే మాకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. పవర్‌ హిట్టర్లు తగినంత మంది ఉన్నారు’ అని శ్రేయస్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడంపై స్పందించిన శ్రేయస్‌.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైందేనని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు ఆ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేశామని, స్పిన్నర్లు బౌలింగ్‌ చేసినప్పుడు బంతి బాగా తిరిగిందని అన్నాడు. స్పిన్‌ బౌలింగే టీమ్‌ఇండియా బలం కాబట్టి కచ్చితంగా వీలైనంత ఎక్కువ స్పిన్నర్లను ఆడించాలనుకున్నామని తెలిపాడు. తమ పద్ధతిలో ఏ మార్పులూ చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఒక ప్రణాళిక ప్రకారమే తాము సన్నద్ధమయ్యామని, వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉందని శ్రేయస్‌ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ ముందున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో వీలైనన్ని ప్రయోగాలు చేసి సరైన జట్టు కూర్పును కనుగొనాలని చెప్పాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని