RRR.. రాజమౌళికి గొప్ప విజన్‌ ఉంది: శ్రియ - shriya about RRR film
close
Published : 13/09/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR.. రాజమౌళికి గొప్ప విజన్‌ ఉంది: శ్రియ

తారక్‌, చరణ్‌తో అవకాశం రాలేదు..

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని కథానాయిక శ్రియ అన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. అలియా భట్‌ కథానాయిక. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదే చిత్రంలో శ్రియ కూడా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో ఆమె పాత్రకు సంబంధించి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి శ్రియ మీడియాతో మాట్లాడారు. రాజమౌళి ఓ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ‘నాది ఇందులో అతిథి పాత్ర మాత్రమే. ‘ఛత్రపతి’ (2005) తర్వాత మరోసారి రాజమౌళితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా అనిపించింది. ఆయనకు అద్భుతమైన విజన్‌ ఉంది. ఎంతో విభిన్నంగా ఈ సినిమాను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు’.

‘సెట్‌లో‌ ఉన్నంత సేపు నేను ఓ ప్రత్యేకమైన చిత్రంలో భాగం కాబోతున్నాను అనే ఫీలింగ్‌లో ఉన్నా. ఈ కరోనా ప్రభావం తగ్గిన వెంటనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అప్పుడు సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా. నేను అజయ్‌ దేవగణ్‌‌తో కనిపిస్తా. ఆయన గొప్ప నటుడు. అజయ్‌తో నటన ఓ మంచి అనుభవం. కానీ తారక్‌, చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. వాళ్లిద్దరు తెరపై చక్కగా ఉంటారని మాత్రం చెప్పగలను’ అని చెప్పారు.

మరోపక్క ‘అందాధున్‌’ తెలుగు రీమేక్‌లో నటి టబు పాత్రను శ్రియ పోషించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. దీని గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘అవును. నన్ను ఆ సినిమా కోసం సంప్రదించారు. చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. కరోనా వల్ల షూటింగ్స్‌ ఆగిపోయాయి, థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియదు’.

‘నేను నా భర్తతో బార్సిలోనాలో ఉంటున్నా. షూటింగ్స్‌ తిరిగి ప్రారంభమైతే ఇండియాకు తిరిగి రావాలి. కాబట్టి జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ ప్రాజెక్టు ఖరారైతే.. టబు పాత్రలో నటించడాన్ని అదృష్టంగా భావిస్తాను. ఆమె నటించిన అన్నీ చిత్రాలు నేను చూశా, స్ఫూర్తి పొందా. కానీ ఆమెను ఇమిటేట్‌ చేయకుండా, నా తరహాలో నటిస్తా’ అని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని