తరచూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటా: శ్రుతి - shruti haasan on working in covid times
close
Published : 03/04/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తరచూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటా: శ్రుతి

చెన్నై: సినీ నటి శ్రుతిహాసన్‌ తను నటించే సినిమా షూటింగ్‌ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది. ‘‘సినిమా షూటింగ్‌ల కోసం నిత్యం ప్రయాణాలు చేస్తుంటాను. ఈ సమయంలో ప్రయాణం కొంత గందరగోళంగానే ఉంది. అందుకే తరచుగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటుంటాను. నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది రాకూడదని. నేను ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి ప్రోట్‌కాల్‌ని భద్రతా చర్యలును పాటిస్తుంటాను. శానిటైజర్లు, మాస్క్ ధంరించడం విషయంలో అస్సలు రాజీపడను. ఇవన్నీ పాటించాకే మిగతా విషయాల గురించి ఆలోచిస్తా’’ అని తెలిపింది.  శ్రుతిహాసన్‌ ఈ ఏడాదిలో రవితేజ‌తో కలిసి ‘క్రాక్‌’లో సందడి చేసింది. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్‌’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనుంది. ఇక ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ చిత్రంలోనూ ప్రభాస్‌ సరసన కథానాయికగా నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని