బాలీవుడ్‌కు ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ - shruti hassan nominates hrithik roshan-rana-tamannah for green india challenge
close
Published : 13/08/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌కు ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’

హృతిక్‌ రోషన్‌ను నామినేట్‌ చేసిన శ్రుతి హాసన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మొక్కలు నాటండి... మీరూ నాటండి అని మరికొంత మందికి చెప్పండి’ అంటూ మొదలైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాయకా నాయికలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మొక్కలు నాటి.. స్నేహితులకు నామినేట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా కథానాయిక శ్రుతి హాసన్‌ కూడా మొక్కలు నాటారు. ప్రముఖ కథానాయకుడు మహేశ్‌బాబు, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ శ్రుతిని నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. 

మొక్కలు నాటుతున్న ఫొటోను శ్రుతి హాసన్‌ ట్వీట్‌ చేస్తూ... ఈ హరితహారంలో మీరూ పాలుపంచుకోండి అంటూ బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌, నటుడు రానా, నటి తమన్నాను శ్రుతి హాసన్‌ నామినేట్‌ చేసింది. దీంతో ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఇప్పుడు బాలీవుడ్‌కి కూడా వెళ్లింది. మరి అక్కడ హృతిక్‌ మొక్కలు నాటి ఎవరిని నామినేట్‌ చేస్తారో చూడాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని