భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌ - shweta basu prasad says separating from rohit mittal after just a few months of marriage felt simply like a break up
close
Published : 04/02/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

విడాకుల గురించి నటి వైరల్‌ కామెంట్స్‌

హైదరాబాద్‌: ‘ఎక్కాడా.. ఎప్పూడూ’ అంటూ విభిన్నంగా మాట్లాడి.. స్వప్నగా తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతాబసుప్రసాద్‌. ‘కొత్త బంగారులోకం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. కెరీర్‌ ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె అదే సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోహిత్‌ మిట్టల్‌ అనే దర్శకుడిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనుకోని కారణాల వల్ల ఎనిమిది నెలలకే వీరిద్దరూ విడిపోయారు.

కాగా, తాజాగా నటి శ్వేతాబసుప్రసాద్‌.. రోహిత్‌తో విడిపోవడం గురించి స్పందించారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోయామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అది ఒక బ్రేకప్‌లా ఉందన్నారు. ‘కొన్ని కారణాలతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. వివాహం జరిగిన పదేళ్లు లేదా దానికంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా కొంతమంది దంపతులు తమ బంధానికి స్వస్తి చెప్పడం మనం చూస్తేనే ఉన్నాం. కానీ, మేమిద్దరం ఎనిమిది నెలల్లోనే దూరం కావాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం కంటే.. ఇది ఓ బ్రేకప్‌లా ఉందనిపిస్తోంది. రోహిత్‌కు దూరమైన సమయంలో ఎంతో బాధపడ్డాను. కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉన్నారు. నాకు నేను ఓ మంచి స్నేహితురాలిగా మారాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి

మద్యం వల్లే బరువు పెరిగానని అనుకున్నారు..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని