‘శ్యామ్‌ సింగరాయ్‌’కు భారీ డిమాండ్‌? - shyam singha roy massive digital satellite deals offered
close
Published : 24/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శ్యామ్‌ సింగరాయ్‌’కు భారీ డిమాండ్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని, సాయి పల్లవి జంటగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కోల్‌కతాను తలపించేలా భారీ సెట్‌ను రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5కోట్లతో దీన్ని తీర్చిదిద్ది కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందట. ప్రముఖ ఓటీటీ వేదికలతో పాటు, సన్‌, స్టార్‌, జీ నెట్‌వర్క్‌లు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని టాలీవుడ్‌లో టాక్‌. అదే విధంగా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని