BJP: ఏపీ నేతతో సిద్ధార్థ్‌ ట్విటర్‌ వార్‌ - siddarth harsh comments on bjp leader
close
Published : 07/05/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BJP: ఏపీ నేతతో సిద్ధార్థ్‌ ట్విటర్‌ వార్‌

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీకి, సిద్ధార్థ్‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసే విషయంలో ఎన్నో సందర్భాల్లో విఫలమైందని పేర్కొంటూ గత కొన్నిరోజుల నుంచి సిద్ధార్థ్‌ వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాజపాపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, తమ పార్టీని తప్పుబడుతున్న సిద్ధార్థ్‌కు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేత విష్ణువర్ధన్‌ రెడ్డి తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘సిద్ధార్థ్‌.. నీ సినిమాలన్నింటికీ దావూద్‌ ఇబ్రహీం పన్ను చెల్లిస్తాడట కదా? ముందు దీనికి సమాధానం చెప్పు’’ అని సిద్ధార్థ్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించారు.

కాగా, తాజాగా ఈ ట్వీట్‌కు సిద్ధార్థ్‌ కౌంటర్‌ వేశారు. ‘‘నో. దావూద్‌ ఇబ్రహీం నా పన్నులు కట్టడం లేదు. అందుకు ఆయన సిద్ధంగా కూడా లేరు. నేను నిజమైన దేశ పౌరుడిని. అలాగే పన్ను చెల్లించే వ్యక్తిని. ’’ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు, ఇటీవల తమిళనాడుకు చెందిన కొంతమంది భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారని.. దాంతో తనకి, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని సిద్ధార్థ్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయమై ఆయన పోలీసులను సైతం సంప్రదించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని