Madhu Priya: పోలీసులను ఆశ్రయించిన గాయని - singer madhu priya files complaint against blank calls
close
Published : 23/05/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Madhu Priya: పోలీసులను ఆశ్రయించిన గాయని

నారాయణగూడ: సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ ప్రముఖ గాయని మధుప్రియ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా తన ఫోన్‌కు బ్లాంక్‌ కాల్స్‌ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో రకరకాల అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారని చెప్పారు. ఆ వ్యక్తులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని