ఆ హీరోతో నాకో డీల్‌ ఉంది: రకుల్‌ - sivakarthikeyan and i had a pact on the set of ayalaan
close
Published : 23/01/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరోతో నాకో డీల్‌ ఉంది: రకుల్‌

ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన నటి

హైదరాబాద్‌: కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోతో తనకు ఒప్పందం కుదిరిందని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. తెలుగు, తమిళ, బాలీవుడ్‌లలో వరుస చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమాల గురించి మాట్లాడారు. ‘అయలాన్‌‌’ చిత్రం గురించి స్పందిస్తూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని రకుల్‌ అన్నారు.

‘కొవిడ్‌-19 కారణంగా గతేడాది షూట్స్‌ అన్నీ నిలిచిపోవడంతో ‘అయలాన్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేశా. శివ.. చాలా మంచి సహనటుడు. చెన్నైలో నాకు కావాల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పేవారు. డైలాగ్స్‌ విషయంలో నాకెంతో సాయం చేసేవారు. అలాగే ఆయన సెట్‌లో ఎంతో సరదాగా ఉంటూ జోక్స్‌ వేసేవారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్నిరోజులకు మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేమిటంటే.. సెట్‌లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అలాగే నేను ఆయనతో తమిళంలో సంభాషించాలి.’ అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.

ఇదీ చదవండి

ప్రభాస్‌.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని