Doctor trailer: శివకార్తికేయన్‌ ‘డాక్టర్‌’ ట్రైలర్‌.. వైద్యుడి చేతిలో తుపాకీ..! - sivakarthikeyan doctor official trailer
close
Published : 26/09/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Doctor trailer: శివకార్తికేయన్‌ ‘డాక్టర్‌’ ట్రైలర్‌.. వైద్యుడి చేతిలో తుపాకీ..!

హైదరాబాద్‌: తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డాక్టర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా అక్టోబరు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్‌ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని