థానేలో ఆక్సిజన్‌ కొరత.. ఆరుగురి మృతి - six covid patients died in thane vedant hospital
close
Published : 26/04/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థానేలో ఆక్సిజన్‌ కొరత.. ఆరుగురి మృతి

ముంబయి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్‌ అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. కాగా, ఇటీవల దిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్‌ గోల్గెన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 20 మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 66వేల పైచిలుకు కేసులు నమోదు కాగా, మరణాలు రికార్డు స్థాయిలో 832 మంది మరణించారు. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నెలకొందని.. పరిస్థితిని చక్కదిద్దాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని