70 శాతం మరణాలు ఆ రాష్ట్రాల్లోనే  - six states account for more than 70 percentage of indias covid-19 deaths
close
Updated : 02/06/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

70 శాతం మరణాలు ఆ రాష్ట్రాల్లోనే 

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలోని మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఇటీవల పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా 3,207 మంది మహమ్మారికి బలయ్యారు. మహారాష్ట్రలో 854, తమిళనాడులో 490, కర్ణాటకలో 464, కేరళలో 194, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 175, పశ్చిమ్ బెంగాల్‌లో 137 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,35,102 మంది కరోనాతో చనిపోయారు.   మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని