86శాతం కేసులు.. 6 రాష్ట్రాల్లోనే  - six states account for over 85 per cent of fresh cases
close
Published : 04/03/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

86శాతం కేసులు.. 6 రాష్ట్రాల్లోనే 

23 రాష్ట్రాల్లో మరణాల్లేవ్‌: కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కొద్ది రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో సగానికిపైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదుకాగా.. 86శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,407 కొత్త కేసులు బయటపడ్డాయి. అయితే, ఇందులో 85.51శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటకలోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 24 గంటల్లో 9,855 కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఇక కేరళలో 2,765, పంజాబ్‌లో 772 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు కూడా మళ్లీ 1.5శాతం పైకి చేరాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లో యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ, యూపీ, ఝార్ఖండ్‌, బిహార్‌, అసోంలలో క్రితం రోజుతో పోలిస్తే క్రియాశీల కేసులు కాస్త తగ్గాయి. 

23 రాష్ట్రాల్లో సున్నా మరణాలు..

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 89 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 42 మంది, కేరళలో 15, పంజాబ్‌లో 13 మంది వైరస్‌ వల్ల చనిపోయారు. అయితే 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక కరోనా మరణం కూడా నమోదుకాలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, పుదుచ్చేరి, అసోం, లక్షద్వీప్‌, నాగాలాండ్‌, సిక్కిం, లద్దాఖ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, మణిపూర్‌, మిజోరం, మేఘాలయ, డయ్యూ డామన్‌ - దాద్రానగర్‌ హవేలీ, అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో ఎవరూ చనిపోలేదని పేర్కొంది. 

ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ విజృంభణ అధికంగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం దృష్టిసారించింది. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించనుంది. వైరస్‌ వ్యాప్తిపై వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. కరోనాను అరికట్టే చర్యలపై స్థానిక అధికారులకు సలహాలు, సూచనలు చేయనున్నారు. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

1.66 కోట్ల మందికి టీకా 

మరోవైపు దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన, 45-59ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు వ్యాక్సిన్‌ వేయించుకోగా.. గురువారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 1.66కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే దాదాపు 10లక్షల మంది టీకా తీసుకున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని