ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం! - smith might get captaincy back in case of no other choice chappell
close
Updated : 22/01/2021 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!

మరి డేవిడ్‌ వార్నర్‌కు ఎందుకీ అన్యాయమని ఇయాన్ ఛాపెల్‌ ప్రశ్న

సిడ్నీ: టిమ్‌పైన్‌ స్థానంలో మరొకరు దొరక్కపోతే స్టీవ్‌స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అంటున్నారు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ అతడివైపే మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు. అతడితో పాటు ప్యాట్‌ కమిన్స్‌ రేసులో ముందున్నాడని పేర్కొన్నారు. టీమ్‌ఇండియాతో సిరీసులో కీపింగ్‌, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడంతో పైన్‌ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

‘అవును, బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా’ అని ఛాపెల్‌ అన్నారు. నాయకత్వానికి స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దదని చెప్పారు.

‘స్మిత్‌, వార్నర్‌ ఒకే విభాగం కిందకు ఎందుకు రావడం లేదు? నాయకత్వంపై స్మిత్‌కు రెండేళ్ల నిషేధం ఉంటే వార్నర్‌కూ అంతే శిక్ష ఎందుకు లేదు? లేదా సారథ్యంపై వార్నర్‌కు జీవితకాల నిషేధం విధిస్తే స్మిత్‌ను ఎందుకు వదిలేశారు? నా దృష్టిలో వార్నర్‌ కన్నా స్మిత్‌ పెద్ద నేరస్థుడు’ అని ఇయాన్‌ ఛాపెల్‌ కుండబద్దలు కొట్టారు. దక్షిణాఫ్రికాపై 2018లో వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ పథకం వేయగా స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఇందుకు సహకరించారని ఆసీస్‌ విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
స్పైడర్‌ పంత్‌..!
విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని