smriti irani: పెళ్లి గురించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫన్నీ సలహా - smriti irani shares million dollar advice with her instafans
close
Published : 23/07/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

smriti irani: పెళ్లి గురించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫన్నీ సలహా

జీవితానికి నిర్వచనం ఆమె ఏమని చెబుతారంటే..

దిల్లీ: నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్‌ చేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. గతంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ ’ అంటూ ఓ చిన్నారి మది కోరుకుంటున్న విషయాన్ని ఓ పవర్ ఫుల్‌ సందేశం ద్వారా వినిపించారామె. తాజాగా వివాహం, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్టు చేశారు. ఇక వివాహం విషయానికొస్తే.. ‘‘మీరు ఒక వ్యక్తిని పెళ్లాడే ముందు.. ఆ వ్యక్తితో స్లో ఇంటర్నెట్‌ కంప్యూటర్ ఇచ్చి దాని మీద పనిచేయమనండి.. తద్వారా ఆ వ్యక్తిలో సహనంతో పాటు ఆ సమయంలో ప్రవర్తించే తీరును పరీక్షించొచ్చు. ఆ పై ఒక అంచనాకు వచ్చి పెళ్లాడండి’’ అంటూ సరదాగా చెప్పారు.  చివర్లో.. జీవితం అనే పదానికి నిర్వచనమిస్తూ.. జీవితంలో కృషి చేయందే.. ఏదీ పర్‌ఫెక్ట్‌ కాదని.. ఇది ‘ఆంటీ అడ్వైజ్‌’ అంటూ సలహాఇచ్చారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని