శ్రుతిహాసన్‌ లక్కీఛాన్స్‌ కొట్టేసిందా? - social buz on salaar movie related to shruthi hassan role
close
Updated : 29/01/2021 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతిహాసన్‌ లక్కీఛాన్స్‌ కొట్టేసిందా?

సోషల్‌మీడియాలోº జోరందుకున్న ప్రచారం

హైదరాబాద్‌: నటి శ్రుతిహాసన్‌ లక్కీఛాన్స్‌ కొట్టేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఓ భారీ యాక్షన్‌ ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటించే అవకాశాన్ని ఆమె పొందారని ప్రస్తుతం సినీ పరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలో పట్టాలెక్కనుంది.

కాగా, ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాన్‌ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్‌నీల్‌.. శ్రుతితో సంప్రదింపులు జరిపారట. అనుకోని విధంగా ఇలాంటి లక్కీ ఛాన్స్‌ తనను వరించడంతో శ్రుతిహాసన్‌ ప్రస్తుతం డేట్స్‌ సద్దుబాటు చేసే పనిలో పడ్డారట. అయితే సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు వస్తున్నాడా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని