చిరు మనవరాళ్ల సందడి.. జున్నుతో నాని - social look film celebrities updates
close
Published : 02/11/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు మనవరాళ్ల సందడి.. జున్నుతో నాని

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విషయాలు.. 

* అగ్ర కథానాయకుడు చిరంజీవి తన మనవరాళ్లు సంహిత, నివ్రితిలతో కలిసి కేఎఫ్‌సీ స్టైల్‌ చికెన్‌ చేశారు. మనవరాళ్లు తన సహాయకులని, వారితో కలిసి వంట చేయడం సరదాగా అనిపించిందని చెప్పారు. అంతేకాదు వారితో కలిసి రోడ్డు పక్కన బండిపెట్టుకుని ‘కేఎఫ్‌సీ చికెన్‌..’ వండి, అమ్మేలా నిపుణులు అయ్యారని కితాబిచ్చారు.

* అల్లు కుటుంబంలో హాలోవిన్‌ వేడుకలు సందడిగా జరుపుకొన్నారు. అయాన్‌, అర్హను భయపెట్టే గెటప్‌లలో సిద్ధం చేసి, స్నేహారెడ్డి ఫొటోలు షేర్‌ చేశారు.

* లాక్‌డౌన్‌లో కథానాయకుడు నాని తన కుమారుడు అర్జున్‌తో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు. జున్నుతో కలిసి తీసుకున్న ఫొటోల్ని ఆదివారం షేర్‌ చేశారు. వీటికి మంచు లక్ష్మి, కీర్తి సురేశ్‌, కామ్నా జఠ్మలానీ తదితరులు కామెంట్లు కూడా చేశారు.

* ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. శాకాహారిగా జీవించడానికి చాలా రకాల ఆహారాలు ఉన్నాయన్నారు. ఇలా ఉండటం లైఫ్‌స్టైల్‌ అని, ఇది డైట్‌ కాదని పేర్కొన్నారు.

* అంతర్వేది శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని కథానాయకుడు నిఖిల్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంగణంలోని గోవులకు ఆహారం తినిపిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.

* బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ ముంబయి విమానాశ్రయంలో తీసుకున్న ఫొటో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇన్నాళ్లూ తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న కత్రిన షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో భద్రత ముఖ్యమంటూ పీపీఈ కిట్‌తో కనిపించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని