వేకప్‌కు ముందే మేకప్‌.. లవ్‌స్టోరీకి ప్యాకప్‌ - social look of cinema celebreties
close
Published : 19/11/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేకప్‌కు ముందే మేకప్‌.. లవ్‌స్టోరీకి ప్యాకప్‌

Social Look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: 
* కొంతమందికి వేకప్‌(మేల్కొనడం) కావాలంటే మేకప్‌ అవసరం అని ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ పోస్టు చేసింది. అందులో రింగులు తిరిగిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. దీంతోపాటు మరో రెండు పోస్టులు కూడా చేసిందామె.
* శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.
* టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఒక ఫొటో షేర్‌ చేశారు. అందులో ప్రిన్స్‌ తన కొడుకు గౌతమ్‌తో కలిసి మాస్క్‌తో ఉన్నారు.
* బర్త్‌డే భామ నయనతార తన ఫొటోను షేర్‌ చేసింది. వయసైపోతోందని మరో పోస్టు కూడా చేసింది.
* మీ కాంతిని ప్రకాశించనీయండి అంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది.
* ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మై జబర్దస్త్‌ డే’ ప్రోమో ఈ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నాననంటూ బుల్లితెర యాంకర్‌ అనసూయ ప్రకటించింది. 
* మధురమైన పుస్తకం అందించినందుకు కరన్‌ జోహర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అభినందనలు తెలిపింది.
* సినీ కథానాయకుడు ఆది కొత్త అవతారంలో ఒక ఫొటోను పోస్టు చేశారు.
* ఆకాశమే నీ హద్దురా సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, స్ఫూర్తినింపే చిత్రమని యాంకర్‌, నటుడు ప్రదీప్‌ మాచిరాజు ఓ ట్వీట్‌ చేశాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని