తాగడానికి తగని సమయముంటదా..! - social look of nagachaitanya varuntej raviteja
close
Published : 19/01/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాగడానికి తగని సమయముంటదా..!

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* అక్కినేని హీరో నాగచైతన్య రేసర్‌ అవతారమెత్తాడు. మళ్లీ తిరిగి ట్రాక్‌ మీదకు రావడం సంతోషంగా ఉందంటూ ఫొటోలు పంచుకున్నాడు. 

* కాఫీ తాగడానికి తగని సమయమంటూ ఉండదంటున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను కాఫీ తాగుతున్న ఒక ఫొటోను పంచుకున్నాడు. 

* లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ అంటున్నాడు మాస్‌ మహారాజ్‌ రవితేజ. అదేంటీ ఆయన డైరెక్టర్‌గా మారాడా..! అని ఆశ్చర్యపోకండి. తన తర్వాతి సినిమా ‘ఖిలాడి’ సెట్లో జరుగుతున్న షూటింగ్‌ తీరును ఆయన అభిమానులతో పంచుకున్నారు.

* కొత్త పెళ్లికూతురు నిహారిక దగ్గర ఏదో రహస్యం ఉందట. ‘కానీ.. నేను మీకు రహస్యం చెబితే అది రహస్యం ఎలా అవుతుంది. అందుకే.. సారీ’ అంటూ తన పెళ్లి ఫొటోను జోడించి ఒక ఫన్నీ పోస్టు చేసిందామె.

* చాలాకాలం తర్వాత మళ్లీ తమ స్వస్థలానికి వచ్చినట్లు ఉందని నటి లారాదత్తా అంటోంది. తన భర్త భారత టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌భూపతితో కలిసి ఆమె థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని