పొద్దు తిరుగుడు చేనులో వాణి.. విజయ్‌తో సారా - social look
close
Published : 15/02/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొద్దు తిరుగుడు చేనులో వాణి.. విజయ్‌తో సారా

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల వాలంటైన్స్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫొటో పంచుకుంది. చరణ్‌ కారు నడిపిస్తుండగా ఆమె ఫొటో క్లిక్‌మనిపించింది.

* విజయ్‌ దేవరకొండతో కలిసి దిగిన ఒక ఫొటోను బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సారా అలీఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పంచుకుంది. ఫన్‌టైమ్‌ విత్‌ విజయ్‌ అంటూ ఆమె రాసుకొచ్చింది.

* గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడానికి అందరూ మొక్కలు నాటాలని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రశంసిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.

* యాంకర్‌ రవి తన పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాము వాలంటైన్స్‌ కాకున్నా.. ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నామని ఒక వీడియో పంచుకున్నాడు.

* ఆనందాన్ని మీ ప్రయాణంలోనే ఉండనివ్వండి.. దూరంగా ఉన్న లక్ష్యంలో కాదంటోంది అలనాటి హీరోయిన్‌ మనీషా కొయిరాలా. 

* ‘బెల్‌బాటమ్‌’ నటి వాణీకపూర్‌ పొద్దుతిరుగుడు చేనులో సూర్యరశ్మిని ఆస్వాదిస్తోంది. అందమైన ఫొటోలు పంచుకుందామె.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని