కంగనా ఫేవ‌రేట్ వీడియో.. టీనేజీలోకి మున్నీ - social look
close
Published : 05/06/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగనా ఫేవ‌రేట్ వీడియో.. టీనేజీలోకి మున్నీ

social look:సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కొవిడ్ సంక్షోభంలో మ‌న‌మంతా ఒక‌టిగా నిల‌వాల‌ని, ఒక‌రికొక‌రం సాయం చేసుకోవాల‌ని కోరింది యువ నాయిక ర‌ష్మిక‌. కొవిడ్ కేర్ కిట్ ఉచితంగా అందిస్తోన్న ‘ధ‌ని’ యాప్ గురించి స‌మాచారం అందించింది.

* త‌న సోద‌రుడికి సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది ప్ర‌ముఖ న‌టి అనుష్క శెట్టి. 

*  త‌న‌కు ఎంత‌గానో ఇష్ట‌మైన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్‌. ఇందులో త‌న ముద్దుల‌ మేన‌ల్లుడు ఏడుస్తూ క‌నిపించాడు.

* స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన ‘భ‌జ‌రంగీ భాయిజాన్’ చిత్రంలో మున్నీగా న‌టించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది హ‌ర్షాలీ మల్హొత్రా. 2021 జూన్ 3న 13వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది హ‌ర్షాలీ. టీనేజీలో అడుగుపెట్టాను అని ఇన్‌స్టా వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేసింది.

* పిల్లితో ఆడుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. దాంతో క‌లిసి దిగిన ఫొటోని అభిమానుల‌కు చూపిస్తూ.. ఒక పిల్లి మ‌రో పిల్లిని లీడ్ చేస్తోంది అని రాసుకొచ్చింది.

* యువ న‌టి మాళ‌విక శ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని అనుస‌రిస్తోన్న వారి సంఖ్య 1 మిలియన్‌కి (10 ల‌క్ష‌లు) చేరింది. ఈ సంద‌ర్భంగా  త‌న‌పై అభిమానం చూపించిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

* ముళ్లు త‌గ‌ల‌కుండా గులాబీని పొందలేం అంటోంది లక్ష్మిరాయ్‌. త‌న కొత్త ఫొటోని పంచుకుంటూ ఈ వ్యాఖ్య‌ని జోడించింది.

 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని