పవన్‌-మహేశ్‌ పోటీ పడనున్నారా? - social media buzz on sarkaruvari pata and pspk27 movie release
close
Published : 27/02/2021 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-మహేశ్‌ పోటీ పడనున్నారా?

జోరుగా సాగుతోన్న ప్రచారం

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్‌కు ఎంతో ప్రత్యేకం. అప్పుడు విడుదలయ్యే సినిమాలపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇక పెద్ద హీరోల సినిమాలైతే చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు తన తదుపరి చిత్రం ‘సర్కారువారి పాట’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా.. పవన్‌ 27వ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్‌ కానుందంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

సర్కారువారి పాట ఫిక్స్‌..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, పరశురామ్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో ప్రారంభమైంది. మహేశ్‌-కీర్తిలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలతోపాటు, పలు యాక్షన్‌ సీక్వెన్స్‌లనూ అక్కడ చిత్రీకరించారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇటీవల చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ‘సరిలేరునీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌ వచ్చే ఏడాది సైతం సూపర్‌హిట్‌ సొంతం చేసుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌కల్యాణ్‌ కూడా అప్పుడేనా..?

వరుస ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తూ అభిమానులకు ట్రీట్‌ అందిస్తున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన ‘అయ్యప్పనుమ్ కోషియం‌’ రీమేక్‌తోపాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సినిమాలో నటిస్తున్నారు. PSPK27గా తెరకెక్కుతోన్న చిత్రంలో పవన్‌ని వజ్రాలదొంగగా క్రిష్‌ చూపించనున్నారని సమాచారం. నిధి అగర్వాల్‌ కథానాయిక. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద మహేశ్‌, పవన్‌ చిత్రాలకు మధ్య పోటీ ఉంటుందని పోస్టులు దర్శనమిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని