పెళ్లి కూతురు రెడీ.. రకుల్‌ తలకిందులు  - social media
close
Published : 10/12/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి కూతురు రెడీ.. రకుల్‌ తలకిందులు 

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* మరికొన్ని నిమిషాల్లో చైతన్య మెగా వారసురాలు నిహారిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఇప్పటికే నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. మరోపక్క బుధవారం ఉదయం జరిగిన హల్దీ వేడుక ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

* కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చాలా రోజుల తర్వాత యోగా తరగతులకు హాజరయ్యారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె వీడియో షేర్‌ చేశారు. తాడు సాయంతో తలకిందులుగా మారి కనిపించారు. రకుల్‌ ఇటీవల వియారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ దాదాపు వారం రోజులు గడిపి, ఇటీవల భారత్‌ చేరుకున్నారు.

* బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి తన కండలు చూపించి ఫిట్‌నెస్‌ పరంగా స్ఫూర్తి నింపారు. చొక్కా లేకుండా ఆయన షేర్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. 

* ‘జీవితంలో అమూల్యమైన విషయం ఒకటే. కుటుంబ సభ్యులతో వీలైనంత సమయం గడపడం’ అంటున్నారు మంచు లక్ష్మి. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

ఇదీ చదవండి..
పవన్‌ వచ్చేశాడు.. పూల్‌ పార్టీలో నిహారిక

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని