కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగాలేదు! - some indian players are not playing in their ideal positions says ajay jadeja
close
Published : 19/03/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగాలేదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ అత్యుత్తమ ప్రయోజనాల మేరకు లేదని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌, మేళవింపు సరిగ్గా లేదని విమర్శించాడు. ఇంగ్లాండ్‌ పేసర్లను ఎదుర్కోలేకపోవడానికి కారణమిదేనని వెల్లడించాడు. నాలుగో టీ20కి ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు.

కొత్త ఆటగాళ్లు రావడంతో జట్టులో విపరీతంగా మార్పులు చేయాల్సి వస్తోంది. తొలి టీ20లో రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌ చేశారు. రెండో టీ20లో రాహుల్‌, కిషన్‌ చేశారు. మూడో టీ20లో రోహిత్‌ రావడంతో కిషన్‌ మూడో స్థానానికి, కోహ్లీ నాలుగో స్థానానికి వచ్చారు. సూర్యకుమార్‌ చోటు కోల్పోయాడు.

‘కొందరు ఆటగాళ్లు వారికి అనువైన స్థానాల్లో ఆడటం లేదనిపిస్తోంది. ఉదాహరణకు హార్దిక్‌ పాండ్య ఆటకు నేను అభిమానిని. అతడు బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి ఇంగ్లాండ్‌ పేసర్లలో ఎవరెవరికి ఎన్ని ఓవర్లు మిగిలుంటున్నాయో చూడండి. ఆర్చర్‌, మార్క్‌వుడ్‌, మరొకరికి ఒకటో రెండో ఓవర్లు ఉంటున్నాయి. ఐదుగురు అత్యుత్తమ పేసర్లున్న జట్టు మరొకటి లేదు. చాలావరకు ఒకరితో పోలిస్తే మరొకరు బలహీనంగా ఉంటుంటారు. అందుకే ఏ బౌలర్‌ వేస్తున్నప్పుడు ఎదురుదాడికి దిగాలో, పరుగులు రాబట్టాలో టీమ్‌ఇండియా అర్థం చేసుకోవాలి’ అని అజయ్‌ అన్నాడు.

‘తనదైన రోజున హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ వేగం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందుకే ఆర్చర్‌ లేదా వుడ్‌, జోర్డాన్‌ లేదా కరన్‌ బౌలింగ్‌ వేస్తున్నప్పుడు ఎవరిపై ఆధిపత్యం చెలాయించాలో బ్యాట్స్‌మెన్‌ ముందుగానే నిర్ణయించుకోవాలి. అందుకే ప్రస్తుత టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ అత్యుత్తమ ప్రయోజనాల మేరకు లేదనిపిస్తోంది’ అని అజయ్‌ పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని