పెట్రోల్‌ ధరలపై కేంద్రం రికార్డులు: సోనియా - sonia gandhi accuses bjpled government of profiteering says petrol diesel prices
close
Updated : 08/01/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌ ధరలపై కేంద్రం రికార్డులు: సోనియా

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత 73 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఇలా అధిక ధరలతో భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘స్వతంత్ర భారతదేశచరిత్రలో తొలిసారిగా.. ఎప్పుడూ చూడని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు తమ డిమాండ్ల కోసం 44 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జాలీ, దయ లేని భాజపా ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం పెంపుతో పేదలు, మధ్యతరగతి ప్రజల వెన్ను విరుస్తోంది’ అని సోనియా తీవ్ర విమర్శలు చేశారు.  

‘ఈ ఆరేళ్లలో మోదీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి సామాన్యుడి జేబులో నుంచి రూ.19లక్షల కోట్లు తీసుకుంది. ఈ రోజు ముడి చమురు ధర లీటరుకు రూ.23.43 (బ్యారెల్‌ 50.96 యూఎస్‌డీ) ఉండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.38, పెట్రోల్‌ రూ.84.20గా విక్రయిస్తోంది. గత 73 ఏళ్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇవే అత్యధికం. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తక్కువే ఉన్నప్పటికీ.. కేంద్రం మాత్రం రికార్డులు బద్దలు కొడుతూ.. ఎక్సైజ్‌ సుంకం పెంచి ప్రజలకు ప్రయోజనాలు కల్పించడం లేదు. చివరకు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెంచి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది’ అని ఆరోపించారు. ‘పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని యూపీఏ ప్రభుత్వంలో ఉన్న స్థాయికి తెచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించాలి. అంతేకాకుండా రైతులు భారంగా భావిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి’ అని కాంగ్రెస్‌ అధినేత్రి డిమాండు చేశారు. 

ఇదీ చదవండి

బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని