‘ఆచార్య’ సెట్లో స్మార్ట్‌ఫోన్లు పంచిన సోనూ - sonu sood distributed smartphones to acharya team
close
Published : 06/01/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ సెట్లో స్మార్ట్‌ఫోన్లు పంచిన సోనూ

హైదరాబాద్‌‌: సోనూ ఉదారత సినిమా ఇండస్ట్రీకి కూడా పాకింది. నటుడు సోనూసూద్‌ ఇప్పటివరకూ సాధారణ ప్రజలకు ఎన్నో రకాలుగా సాయం చేయడం చూశాం. ఇప్పుడు ఆయన సినీఇండస్ట్రీలో కార్మికులను ఆదుకునే పనిలోపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ సెట్లో చిత్ర యూనిట్‌ సభ్యులకు సెల్‌ఫోన్లు అందజేశారట. ఇలా స్మార్ట్‌ఫోన్‌ కొనలేని దాదాపు 100 మందికి ఫోన్లు స్వయంగా పంపిణీ చేశారట. దీంతో సెట్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాకపోతే.. సోనూ సెల్‌ఫోన్లు అందజేస్తున్న ఫొటోలు మాత్రం సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో సోనూపై నెటిజెన్లు ఎప్పటిలాగే ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో సోనూసూద్‌ రెండు సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’. ప్రస్తుతం సోనూ, చిరంజీవికి మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సోనూ నటించిన మరో చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదీ చదవండి..

కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ని అవుతా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని