మహారాష్ట్ర పోలీసులకు సోనూ ఫేస్‌షీల్డ్స్‌ - sonu sood gave twenty five thousand face shields to Maharashtra police
close
Published : 18/07/2020 00:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర పోలీసులకు సోనూ ఫేస్‌షీల్డ్స్‌

ముంబయి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలాంటి వారికి నటుడు సోనూ సూద్‌ బాసటగా నిలిచిన విషయమూ విదితమే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాడు. ఇందుకోసం సోనూ రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఇటీవల లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరణించిన, గాయపడిన 400 వలస కార్మికుల కుటుంబాల బాధ్యత తాను తీసుకొని గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా మరోసారి సోనూ తన ఉదారత చూపించాడు. మహారాష్ట్ర పోలీసుల కోసం కరోనా సోకకుండా ఉపయోగించే 25వేల ఫేస్‌షీల్డ్స్‌ను విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సోనూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కలిశారు. ఇద్దరు కలిసిన దిగిన ఫొటోను హోంమంత్రి అనిల్ ట్విటర్‌లో పోస్టు చేసి సోనూ సాయం గురించి వెల్లడించారు. అతడికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘మహారాష్ట్ర పోలీసుల కోసం 25వేల ఫేస్‌షీల్డ్స్‌ ఇచ్చి ఉదార సహకారాన్ని అందించిన సోనూసూద్‌కు ధన్యవాదాలు’’అని ట్వీట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంలో సోనూ ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలతో ఓ పుసక్తం రాయాలన్న యోచనలో ఉన్నట్లు సోనూ ఇది వరకు తెలిపారు. ‘‘నేను ముంబయి నగరానికి వచ్చింది ఇలా సాయం చేయడానికేనని నమ్ముతున్నాను. వలస కార్మికులకు సాయం చేయగలిగే శక్తినిచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ముంబయి నగరం తర్వాత యూపీ, బిహార్‌, ఝార్ఖండ్‌, అసోం, ఉత్తరాఖండ్‌లోని ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి వారితో నాకు స్నేహం ఏర్పడింది. ఈ అనుభవాలను ఓ పుస్తకంగా మార్చాలని నిర్ణయించుకున్నా.’’అని సోనూ తెలిపారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని