మరోసారి ఉదారత చాటుకున్న రియల్‌హీరో - sonu sood gets covid patient airlifted from nagpur to hyderabad for treatment
close
Published : 24/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి ఉదారత చాటుకున్న రియల్‌హీరో

కొవిడ్‌ రోగి కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు

ముంబయి: రియల్‌హీరో సోనూసూద్‌ తన సేవాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్‌ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ యువతికి ప్రత్యేక చికిత్స అందించేందుకు సోనూ ముందుకు వచ్చారు. అంతేకాకుండా చికిత్స కోసం ఆమెను నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు.

మహారాష్ట్రకు చెందిన భారతి అనే యువతి ఇటీవల కొవిడ్‌ బారిన పడి నాగ్‌పూర్‌ ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85శాతం వరకు దెబ్బతిన్నాయి. ఆమె ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స చేయాలని నాగ్‌పూర్‌ వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌.. ఆమెకు తగిన సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. వెంటనే ఆయన నాగ్‌పూర్‌ వైద్యుల్ని సంప్రదించగా హైదరాబాద్‌ అపోలోలో భారతికి అవసరమైన ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉందని వాళ్లు సూచించారు. దీంతో హైదరాబాద్‌ అపోలో వైద్యుల్ని సంప్రదించిన సోనూ.. ప్రత్యేకంగా ఓ ఎయిర్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి భారతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. ప్రస్తుతం ఆమె అపోలోలో చికిత్స పొందుతున్నారు.

‘‘భారతి బతికేందుకు కేవలం 20శాతం మాత్రమే అవకాశముంది. అయినా చికిత్స చేయిస్తారా?’ అని వైద్యులు నన్ను అడిగారు. ‘తప్పకుండా చేయిస్తాను’ అని సమాధానం ఇచ్చాను. ఎందుకంటే ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఆమె కోలుకునే అవకాశముందని నిర్ణయించుకున్నాకే ఎయిర్‌ అంబులెన్స్‌ని ఏర్పాటు చేయించాను. అలాగే దేశంలోనే పేరుపొందిన వైద్యబృందం ఆమెకు చికిత్స అందిస్తుంది. ఆమె త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నా’ అని సోనూసూద్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని