Sonusood: ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదు - sonu sood regrets about his been seen as nagraj
close
Updated : 18/05/2021 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonusood: ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుర జ్ఞాపకాలను ఎవరు కోరుకోరు..! కరోనా కాలంలో అందరికీ సేవ చేస్తూ ‘మెస్సయ్య’ అని పేరు తెచ్చుకున్న సోనూసూద్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమాల్లో ఇప్పుడు స్టార్‌గా కొనసాగుతున్న సోనూ.. చాలామంది నటుల్లాగే కూడా సినిమాల్లోకి రాకముందు టీవీ షోల్లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. సోనూసూద్‌ తొలినాళ్లలో ఒక కామిక్‌ షో కోసం పోషించిన పాత్ర ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కామిక్‌ షో కోసం తాను పోషించిన ‘నాగ్‌రాజ్‌’ పాత్రపై సోనూ స్పందించారు. ఇప్పుడు తన దగ్గర దానికి సంబంధించిన జ్ఞాపకం లేకపోవడంతో చింతిస్తున్నానన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

ఒక కామిక్‌ షో కోసం చేసిన ప్రకటనలో సోనూసూద్‌ ‘నాగరాజ్‌’ పాత్రలో కనిపించారు. అందులో ‘నాగరాజ్‌’గా సోనూ ఆపదలో జనాలను కాపాడుతూ ఉంటారు. అందులో ఆకుపచ్చ దుస్తులు ధరించి.. నోటి నుంచి మంటను వదులుతూ.. గాల్లోకి ఎగురుతూ కనిపించారు. అయితే.. ఈ నాగరాజ్‌ పాత్ర గురించి సోనూను ఒక కార్యక్రమంలో అడగ్గా.. ‘‘నా కెరీర్‌లో నాకు దొరికిన తొలి పాత్ర అది. అయితే.. నన్ను నేను అలా చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి మార్కెట్‌కు వెళ్లగా ఆ కామిక్‌ షోకు సంబంధించి నా ఫొటోగ్రాఫ్‌తో బుక్‌ కనిపించింది. దాన్ని చూసిన తర్వాత ‘నేను అలా లేను కదా’ అని సిగ్గుపడ్డాను. ఆ పుస్తకం కొనమని మా మరదలు నాకు చెప్పింది. నేను మాత్రం కొనలేదు. ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదని చింతిస్తున్నాను. అయితే.. అప్పటినుంచే నాకు దిల్లీలో మంచి గుర్తింపు వచ్చింది’ అని సోనూసూద్‌ గుర్తు చేసుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని