‘కిసాన్‌’గా రానున్న సోనూసూద్‌ - sonu sood to star in e niwass kisaan amitabh bachchan sends good wishes
close
Published : 04/01/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కిసాన్‌’గా రానున్న సోనూసూద్‌

ముంబయి: సోనూసూద్‌ ప్రధానపాత్రలో ‘కిసాన్‌’అనే మూవీ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్‌లో నిర్మితమౌతున్న ఈ చిత్రాన్ని  దర్శకుడు ఇ.నివాస్‌ తెరకెక్కించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. బిగ్‌ బీ అమితాబ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలపటం విశేషం. లాక్‌డౌన్‌ సమయం నుంచి అభాగ్యులకు సహాయం చేస్తూ రియల్‌హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్‌. మొన్నటివరకు సినిమాల్లో ప్రతినాయక పాత్రల కోసమే సినీ దర్శకులు ఆయన్ను ఎక్కువగా సంప్రదించేవారు. కానీ తాజాగా ఆయనకు వస్తున్న ప్రజాభిమానం చూసి చాలామంది దర్శకులు సోనూ ప్రధానపాత్రలో కథలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాక ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో సైతం సోనూభాయ్‌ పాత్ర ప్రవర్తనలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. త్వరలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంతో దానశీలి సోనూభాయ్‌ని హీరోగా చూసేందుకు ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సోనూ తెలుగులో ఆచార్యతోపాటు, అల్లుడు అదుర్స్‌ చిత్రంలో నటిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్‌’ సంక్రాంతి బరిలో ఉంది.

ఇవీ చదవండి!

ఏపీలోనూ షాక్‌ ట్రీట్‌మెంట్‌ తప్పదు: బండి సంజయ్‌

డిసెంబర్‌ 31:డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులెన్నంటే..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని