Sonusood: ఐఏఎస్‌ కావాలనుకుంటే.. మీ బాధ్యత మాదే - sonu sood will take the responsibility of
close
Published : 12/06/2021 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonusood: ఐఏఎస్‌ కావాలనుకుంటే.. మీ బాధ్యత మాదే

‘సంభవం’ పేరుతో ఉపకారవేతనాలు అందించనున్న సోనూసూద్

ముంబయి: కరోనా వేళ.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్నారు నటుడు సోనూసూద్. తాజాగా సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకునే వారికి అండగా నిలవాలనుకుంటున్నారు. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.

‘‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. దానిలో భాగంగా సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం అవుతోన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దరఖాస్తుల సమర్పణకు జూన్ 30 చివరి తేదీ అని తెలుస్తోంది. వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

గతేడాది లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఈ రియల్‌ హీరో సొంతంగా రవాణా సదుపాయాలు కల్పించారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం కరోనా రెండో దశలోనూ కొనసాగుతోంది. కరోనా బారిన పడినవారికి వైద్యం అందించడం, అత్యవసరంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి ఆదుకోవడం.. వంటి కార్యక్రమాలతో ప్రజల మదిలో సూపర్‌ హీరోగా స్థానం సంపాదించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని