సోనూ తల్లి పేరుతో రోడ్డు.. ఎక్కడో తెలుసా.? - sonusood responds on saroj sood road
close
Published : 01/01/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ తల్లి పేరుతో రోడ్డు.. ఎక్కడో తెలుసా.?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌లో ఎవరి రక్షణ వారు చూసుకున్నారు. అదే సమయంలో.. అభాగ్యులను ఆదుకొంటూ రీల్‌ లైఫ్‌ విలన్‌ నుంచి రియల్‌ లైఫ్‌ హీరోగా మారారు సోనూసూద్‌. ఎంతో మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారు. పేదలకు ఆర్థికసాయం చేశారు. జబ్బు చేసినవారికి ఆరోగ్యం బాగు చేయించారు. ఇలా.. ఎన్నో చేసి ప్రజల గుండెల్లో మనవత్వానికి ప్రతిరూపంగా సోనూ నిలిచిపోయారు. అందుకు తగ్గట్లుగానే ప్రజలు కూడా సోనూను ఆరాధిస్తున్నారు. గుడి కట్టి దేవుడంటూ పూజిస్తున్నారు. తాజాగా.. ఓ రహదారికి సోనూ తల్లి పేరు పెట్టారు.

పంజాబ్‌లో సోనూసూద్‌ కుటుంబం ఉండే పట్టణం మోగాలోని ఓ రోడ్డుకు సోనూ తల్లి ‘సరోజ్‌సూద్‌’ పేరు పెట్టి అక్కడి ప్రజలు ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఆ రహదారిని స్థానిక ఎమ్మెల్యే హర్జోత్‌ కమల్‌ స్వయంగా ప్రారంభించారు. దీనిపై సోనూసూద్‌ స్పందించారు. ప్రొఫెసర్‌గా పనిచేసే తన తల్లి ఆ రహదారిలోనే నిత్యం కళాశాలకు వెళ్లేదని గుర్తు చేసుకున్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని అధ్యాయమని సోనూ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘ప్రొఫెసర్ సరోజ్‌సూద్ రోడ్’ నా జీవితమంతా కలలుగన్న ఒక దృశ్యం. ఇది నా జీవితంలో అతి ముఖ్యమైన అధ్యాయంగా ఉంటుంది. నా సొంత పట్టణం మోగాలోని ఒక రహదారికి నా తల్లి పేరు పెట్టారు. ఆమె తన జీవితమంతా అదే రహదారిలో ప్రయాణించింది. ఇంటి నుంచి కాలేజీకి, అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేది. ఈ సంఘటన చూసి స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు సంతోషిస్తారని నాకు విశ్వాసం ఉంది. రహదారికి నా తల్లి పేరు పెట్టినందుకు హర్జోత్ కమల్, సందీప్ హన్స్, అనితా దర్శికి కృతజ్ఞతలు. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ‘ప్రొఫెసర్ సరోజ్‌సూద్ రోడ్’ అని ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను’ అని సోనూసూద్‌ పేర్కొన్నారు.

సోనూసూద్‌ తన తల్లి సరోజ్‌సూద్‌ని 2007లో కోల్పోయారు. కొంతకాలానికి 2016లో తండ్రి శక్తిసూద్‌ కూడా మరణించారు. 1996లో తెలుగు యువతి సొనాలిని సోనూ వివాహం చేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు కుమారులు.. అయాన్‌సూద్‌, ఇషాన్‌సూద్‌. సోనూకు అక్క మోనికాసూద్‌, చెల్లి మాళవిక ఉన్నారు. సోనూసూద్‌ పంజాబీ సినిమాలతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ‘అరుంధతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన నటనకు ‘ఉత్తమ ప్రతినాయకుడి’గా నంది పురస్కారం కూడా లభించింది. పెద్దపెద్ద హీరోలకు ప్రతినాయకుడిగా ఆయన తెలుగు తెరపై కనిపించారు.  ప్రస్తుతం మెగస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఆచర్య’, మరో సినిమా ‘అల్లుడు అదుర్స్‌’లో సోనూ నటిస్తున్నారు.

ఇదీ చదవండి..

బొమ్మ థియేటర్లోనే పడాలని..!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని