తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు - sonusood thanked anchor vindhya vishaka
close
Published : 27/05/2021 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖపై బాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌ ప్రశంసలు కురిపించారు. ‘మీరు నిజమైన రాక్‌స్టార్‌’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ విషయాన్ని యాంకర్‌ వింధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో సోనూసూద్‌ మాట్లాడుతూ.. ‘‘హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సహాయానికి ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన సూపర్‌ రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సోనూ పేర్కొన్నారు.

అంతకు ముందు ఏం జరిగిందంటే.. కరోనా సమయంలో సోనూసూద్‌ ఎంతోమంది పేదలను ఆదుకుంటున్న విషయం తెలిసిందే. సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖ తన వంతు సాయంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చింది. తన కాస్టూమ్స్‌ను వేలం వేసి వచ్చిన నగదు మొత్తాన్ని ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై సోనూసూద్‌ స్పందించారు. ప్రత్యేకంగా వీడియో రూపంలో వింధ్యకు కృతజ్ఞతలు చెప్పారు. వింధ్యావిశాఖ పలు టీవీ షోలతో పాటు ఐపీఎల్‌, ప్రొకబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తోంది. సోనూసూద్‌ స్వయంగా స్పందించి తనకు బదులివ్వడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని