‘షాంఘై’కి సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ - soorarai pottru enters panorama section of shanghai international film festival 2021
close
Published : 14/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘షాంఘై’కి సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ఇంటర్నెట్‌ డెస్క్: తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరారై పోట్రు’. తెలుగులో ఈ సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించారు. ఇందులో అపర్ణ బాలమురళి కథానాయికగా నటించింది. తాజాగా ఈ చిత్రం షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం- 2021 వేడుకల్లో పనోరమ విభాగంలో అర్హత సంపాదించింది. ఈ ఉత్సవాలు జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి. చిత్రంలో తెలుగు నటుడు మోహన్‌బాబు ఫైలెట్‌గా తన సొంత పేరుతో భక్తవత్సలం నాయుడుగా నటించారు. పరేష్‌ రావల్‌, ఊర్వశి, కరుణాస్‌, వివేక్ ప్రసన్న తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా సతీష్‌ సూర్య ఎడిటర్‌ పనిచేశారు. గునీత్ మొంగా నిర్మాత.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని