ఆస్కార్ నామినేషన్ రేసులో ‘ఆకాశం నీ హద్దురా’! - soorarai pottru joins oscars in general category
close
Updated : 26/01/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్కార్ నామినేషన్ రేసులో ‘ఆకాశం నీ హద్దురా’!

చెన్నై: సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా వైరస్ కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య నటన, సుధా కొంగర టేకింగ్ అందరినీ అలరించింది. కాగా, ఈ సినిమా ఆస్కార్​ నామినేషన్ రేసులో నిలిచినట్లు సమాచారం. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పలు విభాగాల్లో నామినేట్​ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా అకాడమీ అవార్డులను కేవలం థియేటర్లలో విడుదలైన చిత్రాలనే పరిశీలిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా డిజిటల్​ వేదికల్లోనూ విడుదలైన చిత్రాలను ఆస్కార్​ పోటీకీ అర్హులుగా పరిగణించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఆకాశం నీ హద్దురా తెరకెక్కింది. అకాడమీ స్క్రీనింగ్​ రూమ్​లో మంగళవారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారని సమాచారం. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఇవీ చదవండి..
మెగా న్యూస్‌: ‘ఉప్పెన’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘ఆచార్య’ టీజర్‌: చిరు-కొరటాల ఫన్నీ టాక్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని